న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కోవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో ఓబీసీ ఉపవర్గీకరణపై రోహిణీ కమిషన్ నివేదిక ఆలస్యమైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ బదులిచ్చింది. ఓబీసీల 27శాతం కోటాను సమాన పునర్విభజనపై జస్టిస్ రోహిణి కమిషన్‌కు సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. రోహిణీ కమిషన్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో ఓబీసీల ఉపవర్గీకరణపై సంప్రదింపులు జరుపుతున్నా వర్గీకరణ ఎప్పుడు జరుగుతుందనే విషయంపై నిర్ధిష్ట సమాచారం చెప్పలేదని తెలిపారు.
ఈలోగా ఎలాంటి మధ్యంతర నివేదికను కమిషన్ నుంచి కోరలేదని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. జనాభా గణన చట్టం, 1948లో ఓబీసీ జనాభా లెక్కింపుపై ఎలాంటి నియమాలు లేనందు వల్ల హోం శాఖను కూడా ఓబీసీ జనాభాను లెక్కించాలని కోరలేదని కేంద్ర మంత్రి శ్రీకృష్ణదేవరాయలకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..