వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: పీజీ వైద్య సీట్ల భర్తీకిగాను ఈనెల 27వ తేదివరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ని ర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్‌ఆప్షన్ల కోసం వర్సిటీ నోటిఫికేషన్ విడుదలచేసింది. యూనివర్సిటీ పరిధిలోని పీజీ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
27వ తేది సాయంత్రం 4 గంటల వరకు మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా అదేవిధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.