హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రయివేటు దంత కళాశాలల్లో యాజమాన్య కోటా బీడీఎస్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
సీట్ల ఖాళీల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.