వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: పీజీ దంత సీట్ల భర్తీకిగాను ఈనెల 28వరకు మొదటి విడత వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ఆప్షన్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని పీజీ దంత కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈనెల 26న ఉదయం 10 నుంచి 28న మధ్యాహ్నం 2 గంటలవరకు మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా అదేవిధంగా సీట్లఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.