Friday, November 22, 2024

Repblic Day Massage – ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృమూర్తి – రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ – .భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని కొనియాడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థ పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే చాలా పురాతనమైనదని. అందుకే భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికి తల్లి” అని పిలువడానికి కారణం అని ఆమె అన్నారు. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా నేటి రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం ప్రస్తుతం అమృత్‌ కాల్ ప్రారంభ దశలో ఉందని, భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సువర్ణావకాశం దేశ ప్రజలకు ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇది పరివర్తన సమయమని, మన లక్ష్యాలను సాధించడంలో ప్రతీ పౌరుడి సహకారం చాలా కీలమని చెప్పారు.

రాష్ట్రపతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి రాష్ట్రపతి మాట్లాడారు. అమృత కాలం అపూర్వమైన సాంకేతిక మార్పుల కాలం అవుతుందని, సాంకేతిక పురోగతి మన దైనందిక జీవితంలో భాగమవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఆందోళన కలిగించే అనేక రంగాలు ఉన్నాయని, కానీ ఉత్తేజకరమైన అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా యువత కోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయని అన్నారు

వీటితో పాటు జీ20 సమావేశాలు, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, మహిళా సాధికారత గురించి మాట్లాడారు. అయోధ్య రామ మందిర వేడుకను భారతదేశం మొత్తం చూసిందని, మన నాగరికత వారసత్వాతన్ని తిరిగి కనుగొనడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లను పార్లమెంట్ ఆమోదించిందని, దేశం లింగ సమానత్వ ఆదర్శం వైపు మరింతగా పురోగమించిందని ముర్ము అన్నారు. నారీ శక్తివందన్ అధినియం మహిళా సాధికాతరకు విప్లవాత్మక సాధనంగా మారుతుందని చెప్పారు. ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మన జీడీపీ వృద్ధి అత్యధికంగా ఉందని, ఈ పనితీరు 2024లో అంతకుమించి కొనసాగతుందని అన్నారు.

మూన్ మిషన్, సోలార్ ఎక్స్‌ప్లోరర్ ఆదిత్య ఎల్1, ఎక్స్‌పోశాట్ అనే డీప్ స్పేస్ ప్రోబ్ ఎక్స్-రే పొలారిమీటర్ శాటిలైట్, తయారీ మ్యాన్-మిషన్ గగన్‌యాన్, ఇతర సాంకేతిక మైలురాళ్ల ద్వారా అంతరిక్షంలో భారతదేశం అన్వేషణను రాష్ట్రపతి ప్రశంసించారు.జీ 20 సమ్మిట్ గ్లోబల్ సౌత్ వాయిస్‌ గా భారతదేశం మారిందని అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌ లో మన క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానం డిజిటల్ విభజనను తగ్గించడానికి శక్తినిస్తుందని అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement