Tuesday, November 26, 2024

అనారోగ్యంతో రేణు దేశాయ్‌… ఎమోషనల్ పోస్ట్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన అనారోగ్యం గురించి వెల్లడించారు. తాను కొన్నాళ్లుగా గుండె, ఇతర సమస్యలతో బాధపడుతున్నా అన్నారు. తనను దగ్గరగా చూస్తున్నవారికి ఈ విషయం గురించి తెలుసని చెప్పుకొచ్చారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన శక్తిని కూడగట్టుకుంటున్నానని తెలిపారు. తనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, మందులను వాడుతున్నానని, యోగా చేస్తున్నానని చెప్పారు. తనలా ఎవరైనా సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకే ఈ విషయాన్ని పోస్ట్ చేస్తున్నానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకూడదని సూచించారు. త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకుని షూటింగుల్లో పాల్గొంటానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement