Friday, November 22, 2024

ప‌వ‌న్ కే నా మ‌ద్ద‌తు – నా పిల్ల‌ల‌ను రాజ‌కీయాల‌లోకి లాగ‌వ‌ద్దు – రేణు దేశాయ్ (వీడియోతో )

హైదరాబాద్‌: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నా విష‌యంలో వంద శాతం త‌ప్పు చేసినా…. ప్ర‌జా సేవ కోసం ఆయ‌న చేస్తున్న కృషికి ఎప్పుడూ నా ప్రొత్సాహం ఉంటుంద‌ని ప‌వ‌న్ మాజీ భార్య రేణు దేశాయ్ చెప్పారు.. విడాకులు తీసుకున్న దీర్ఘ‌కాలం త‌ర్వాత రేణు తొలిసారిగా ప‌వ‌న్ గురించి త‌న ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియో విడుద‌ల చేశారు.. రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఎల్ల‌ప్పుడు ఆయ‌న‌కు త‌న‌మ‌ద్దతు ఇస్తున్నాన‌ని అన్నారు.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే త‌లంపుతోనే కుటుంబానికి దూరమ‌య్యార‌ని , ప్ర‌జా సేవ కోసం నిరంత‌రం త‌పించే వ్య‌క్తి ఆయ‌న అని చెప్పారు.. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు.

”మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నా. నేను జీవితంలో ముందుకు సాగిపోతున్నా. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకూ ఆయన అరుదైన వ్యక్తి. ఆయన మనీ మైండెడ్‌ కాదు. డబ్బుపై ఆసక్తి లేదు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు. ఆయనకు పొలిటికల్‌గా ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తుంటా. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించండి. ఆయనొక సక్సెస్‌ఫుల్‌ నటుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే” అని ఆమె చెప్పారు.

ఇదే వీడియోలో ఆమె శ్యాంబాబు విషయంపై మాట్లాడుతూ.. ”ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే, పవన్‌పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయనాయకుడు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి. ” అని ఆమె అన్నారు. ఇది ఒక త‌ల్లిగా నా అభ్య‌ర్ధ‌న మాత్ర‌మేని అన్నారు రేణుదేశాయ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement