Tuesday, November 26, 2024

చైనాలో ఐఫోన్‌ తయారీ పునరుద్ధరణ.. పూర్తి స్థాయిలో పని చేస్తున్న ఫాక్స్‌కాన్‌

చైనాలోని జెంగ్‌ఝూ నగరంలో ఐఫోన్లు తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ తయారీ కేంద్రాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఈ కేంద్రంలో తయారీ 90 శాతం సామార్ధ్యాని కి చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. యాపిల్‌ కంపెనీకి చెందిన ఐ ఫోన్లు, ఐ ప్యాడ్‌ వంటి ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తున్నారు. కొవిడ్‌ ఆంక్షల కారణంగా ఇక్కడ కొంత కాలంగా ఉత్పత్తి నిలిచిపోయింది. దీని వల్ల మన దేశంలో ఐ ఫోన్ల తయారీని కంపెనీ పెంచింది. చైనా జీరో కోవిడ్‌ విధానానికి స్వస్తి పలకడంతో ఈ కేంద్రంలో పూర్వపు స్థాయికి ఉత్పత్తిని మళ్లి పునరుద్ధరించారు.

- Advertisement -

ఈ ప్లాంట్‌లో 2 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి గత ఏడాది జనవరి స్థాయికి అతి త్వరలోనే చేరుతుందని కంపెనీ తెలిపింది. చైనాలో త్వరలోనే నూతన సంవత్సర వేడుకలు జరగనున్నాయి. కొత్త సంవత్సరంలో చైనాలో భారీగా ఐ ఫోన్‌తో పాటు, యాపిల్‌ ఉత్పత్తులు అమ్మకాలు జరుగుతాయి. కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం ఆంక్షలను కఠినంగా అమలు చేసింది.

ఫ్యాక్స్‌కాన్‌లో పని చేస్తున్న కార్మికులకు అక్కడికే పరిమితం చేసింది. దీంతో చాలా మంది కార్మికులు గోడలు దూకి పారిపోయాయారు. ఉన్న కార్మికులు కూడా నిరసనకు దిగారు. దీని ప్రభావంతో చైనాలో చాలా చోట్ల ఇలాంటి నిరసనలే జరిగాయి. దీంతో ప్రభుత్వం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. దీని ఫలితంగా అక్కడ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆంక్షలు సడలించడంతోనే ఫ్యాక్స్‌కాన్‌ కంపెనీలో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement