కరోనా సమయంలో రెమిడిసివిర్ కోసం దేశమంతా తిరిగిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతోనే రెమిడిసివిర్ మాఫియా సాగుతుందన్నారు. పార్థసారథి ఇంట్లో దొరికిన రూ.500 కోట్లపై కేసు అయ్యిందా? లేదా? అని ప్రశ్నించారు. దేశమంతా రెమిడిసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ దందా జరిగింది, రెమిడిసివిర్ బ్లాక్ దందాలో కేంద్రం, రాష్ట్రాలవి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పార్థసారథిపై ఐటీ రైడ్‌లో ఏం జరిగిందో ఇప్పిటికీ బయటకు రాలేదన్నారు. ఐటీ రైడ్‌లో రూ.10 వేల కోట్ల వరకు బయటపడి ఉంటాయి అన్నారు. పార్థసారథి ఫార్మా స్కాం చేశారు, మనుషుల ప్రాణాలతో పార్థసారథి చలగాటం ఆడుతున్నారు, అలాంటి వ్యక్తికి మీరు రాజ్యసభ సీటు ఇస్తారా? అని ప్రశ్నించారు. పార్థసారథి నామినేషన్ తిరస్కరించాలని ఈసీకి లేఖ రాస్తామని జగ్గారెడ్డి అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement