పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వినోదయ సీతం సినిమా రీమేక్ లో నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.సముద్రఖనినే దీనికి దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో దీన్ని ప్రారంభించబోతున్నారట. మొదట షూటింగ్ జరుపుకునే చిత్రమిదే అని చర్చ నడుస్తుంది. హరీష్, సుజీత్‌ల సినిమా కంటే దీన్నే పవన్ ఫస్ట్ చేయబోతున్నారట. ప్రస్తుతం పవన్ హరిహరవీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. దీనికోసం చాలా డేట్స్ అవసరమవుతుంది. ఇంకా సుమారు40శాతం చిత్రీకరించాల్సి ఉందని టాక్. ఇది స్ట్రెయిట్ సినిమా కావడం, పైగా కాస్ట్యూమ్ బేస్డ్ పీరియడ్ చిత్రం కావడంతో దీనికి చాలా రోజులు షూటింగ్‌కి పడుతుందట. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కానీ పరిస్థితి. స్ట్రెయిట్ సినిమాకి చాలా రోజులు షూటింగ్ టైమ్ పడుతుంది. అది బాక్సాఫీసు వద్ద ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే టెన్షన్ ఉంటుంది. అదే హిట్ సినిమాని రీమేక్ చేస్తే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. పవన్ చేతిలో ఎక్కువ డేట్స్ లేవు. ఆయన వచ్చే ఏడాది ఏపీ జనరల్ ఎలక్షన్లకి ప్రీపేర్ కావాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోతారు. సినిమాలు చేయడానికి కుదరదు. అందుకే రీమేక్‌లు ఎంచుకుంటున్నారట. దీని ద్వారా ఎక్కువ సినిమాలు చేసి, సాధ్యమైంత వరకు పారితోషికం రూపంలో డబ్బు కూడబెట్టుకోవాలని, ఎలక్షన్లని వాడుకోవాలని అనుకుంటున్నారట పవర్ స్టార్. పవన్ చేతిలో చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో రీమేక్‌లు అయితే త్వరగా షూటింగ్ పూర్తి చేయొచ్చు. మహా అంటే 20-30 రోజుల్లో ఓ సినిమాని పూర్తి చేయోచ్చు. అంటే నెలకో సినిమాకి డేట్స్ ఇస్తే, ఎలక్షన్ల లోపు రెండు మూడు సినిమాలు పూర్తి చేయోచ్చు. అది అటు ఆర్థికంగా, ఇటు మినిమమ్ గ్యారంటీ ఉండటం, టైమ్ పరంగానూ కలిసొస్తుంది. అందుకే పవన్ రీమేక్ దారి ఎంచుకున్నట్టు సమాచారం. ఆ ప్రకారంగానే వినోదయ సీతం
చిత్రాన్ని కూడా నెల రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నారట పవన్. అందుకే ఆ రీమేక్ కూడా చేయబోతున్నారని సమాచారం. ఇందులో మరో కీలక పాత్రలో హీరో సాయిధరమ్ తేజ్ నటించనున్నారు.