ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేస్తున్న రష్యా మరోమారు అణుయుద్ధం తప్పకపోవచ్చని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు పెద్దఎత్తున ఆయుధాలు ఇస్తూ తమపై పరోక్ష యుద్ధం చేస్తున్న అమెరికా సారథ్యంలోని నాటో కూటమి దేశాలు రెచ్చగొట్టే ధోరణి మార్చుకోకపోతే అణ్వాయుధాలు ప్రయోగించడానికి తాము వెనుకాడబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్‌రోవ్ స్పష్టం చేశారు. ఆ కూటమి ధోరణి ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయం నిలిపివేయాలని ఆయన సూచించారు. రష్యా అధికారిక టెలివిజన్ చానల్‌లో ముఖాముఖి సందర్భంగా అణుయుద్ధంపై లవ్‌రోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు సహాయం పేరిట గుట్టలు గుట్టలుగా నౌకల్లో ఆయుధాలు తరలిస్తున్న నాటో కూటమి దేశాల అసలు లక్ష్యం రష్యాయేనని అన్నారు.
అంతమాత్రాన తాము అణుయుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ ప్రమాదకరమైన వాస్తవ పరిస్థితులను తక్కువ అంచనావేయలేమని, ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు.. చివరకి అణ్వాయుధాలు వాడటానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. అణ్వాయుధాలు ముందుగా వాడబోమంటూ గతంలో అమెరికా-రష్యా మధ్య జరిగిన ఒప్పందాలను పూర్వపక్షం చేయడానికి వెనుకాబడోబమని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య పరోక్షయుద్ధం సాగిన సమయంలో ఒప్పందాల ఉల్లంఘన సర్వసాధారణమైందని, మూడో ప్రపంచయుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అలాంటి ఉల్లంఘనలు ఎటువైపునుంచైనా జరగొచ్చని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..