ఇజ్రాయెల్ యూదులు, అరబ్ లు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. కొద్ది కాలంగా ఈ రెండు వర్గాల్లో మతఘర్షణలు జరుగుతున్నాయి. బుధవారం కొందరు యూదులు ఓ అరబ్ వ్యక్తిపై మూకుమ్మడి దాడికి దిగారు. కారులో వెళుతున్న ఆ వ్యక్తిని కిందకు లాగి నడిరోడ్డుపై పిడిగుద్దులు కురిపించారు. స్పృహ తప్పి పడిపోయేంత వరకు అతడిని కొట్టారు. దాడి జరిగిన 15 నిమిషాల తర్వాతగానీ పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది అక్కడకు చేరుకోలేదు. అయితే, దాడి చేసిన వారు మాత్రం తమ చర్యను సమర్థించుకున్నారు. యూదులపైకి ఆ వ్యక్తి కారుతో వేగంగా దూసుకొచ్చాడని ఆరోపించారు.
దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. యూదులు, అరబ్ లు కొంచెం సహనం పాటించాలని కోరారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.