బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహ్మద్ ప్రవక్త వివాదంలో ఆమెపై నమోదైన 9 కేసులకు సంబంధించి ఆగస్ట్ 10వ తేదీ వరకు ఎలాంటి అరెస్ట్‌లు చేపట్టవద్దని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నుపుర్‌శర్మపై కొత్త కేసులు నమోదు చేయవద్దని సూచించింది. నుపుర్ శర్మపై పలు రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను అన్నింటినీ ఒకే కేసుగా నమోదు చేయాలని కోరుతున్న ఆమె విజ్ఞప్తిని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది.
ఢిల్లి, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, అస్సాం రాష్ట్రాలు స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆమెకు భద్రత, స్వేచ్ఛను కల్పించాలని జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. జులై 1వ తేదీన నుపుర్‌శర్మకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లతో పాటు పలువురు సెలబ్రెటీలు అభ్యంతరం చెబుతూ, సుప్రీంకోర్టుకు బహిరంగ లేఖ రాసిన విషయం విదితమే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.