Thursday, November 21, 2024

Delhi| అస్సాం వ‌ల‌స‌దారుల‌కు ఊర‌ట‌…

  • పౌర‌స‌త్వ చ‌ట్టాన్ని స‌మ‌ర్ధించిన సుప్రీంకోర్టు
  • ఈ చ‌ట్టంలోని 1953 సెక్షన్ 6ఎ ను సమర్థించిన రాజ్యాంగ ధర్మాసనం
  • అయిదుగురి బెంచ్ లో నలుగురు న్యాయ‌మూర్తులు ఓకే
  • 1971 లోపు బంగ్లా నుంచి వ‌చ్చిన వారికి మ‌న పౌర‌స‌త్వం
  • న్యూ ఢిల్లీ – బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు వ‌ల‌స వ‌చ్చిన వారికి ఇవాళ‌ భారీ ఊర‌ట ల‌భించింది.. వారికి పౌర‌స‌త్వ చ‌ట్టం 1955 వ‌ర్తిస్తుంద‌ని సుప్రీంకోర్టు అయిదుగురు స‌భ్యుల ద‌ర్మాసనం తేల్చిచెప్పింది.. పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్‌ 6ఎ రాజ్యంగ బద్ధతను సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం సమర్థించింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం నేడు 4:1 మెజార్టీతో తీర్పును వెలువరించింది. న్యాయమూర్తుల్లో జస్టిస్‌ పార్థీవాలా మాత్రమే ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

ఈసందర్భంగా చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. ”అక్రమ వలసలకు అస్సాం అకార్డ్‌ ఓ రాజకీయ పరిష్కారం. అదే సమయంలో సెక్షన్‌-6ఎ అనేది చట్టబద్ధమైన మార్గం. ఈ నిబంధనలు రూపొందించడానికి మెజార్టీతో కూడిన పార్లమెంటుకు శక్తి ఉంది. మానవీయ ఆందోళనలను పరిష్కరించడంతోపాటు.. స్థానికుల ప్రయోజనాలను కాపాడే సమతౌల్యత ఈ సెక్షన్‌కు ఉంది. ఇక దీనిలోని కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైనదే. ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్‌ యుద్ధం ముగిసింది. బంగ్లాదేశ్‌ యుద్ధం నేపథ్యంలోనే ఈ సెక్షన్‌ తీసుకొచ్చిన విషయాన్ని ఇది చెబుతోంది. ఈ సెక్షన్‌ అంత ఎక్కువగా జనాభాను కలుపుకోలేదు.. మరీ తక్కువగాను విలీనం చేసుకోలేదు” అని పేర్కొన్నారు.

పౌరసత్వ చట్టం-1955 సెక్షన్‌6ఎ ప్రకారం.. 1966 జనవరి నుంచి 1971 మార్చి 25లోపు అస్సాంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు. ఈ నిబంధనను 1985లో అస్సాం అకార్డ్‌ తర్వాత తీసుకొచ్చారు. అస్సాంలోకి బంగ్లాదేశ్‌ వలసలపై ఉద్యమించినవారితో కేంద్రప్రభుత్వం చేసుకొన్న ఒప్పందమే ఇది. దీని చట్టబద్ధతపై అస్సాంలోని కొన్ని స్థానిక గ్రూపులు న్యాయస్థానంలో సవాలు చేశాయి. ఇది రాజ్యాంగ పీఠికకు విరుద్ధమని, పౌరహక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ రాజకీయ హక్కులను హరించడమేనని వాదించాయి. వారికి పౌర‌స‌త్వం ఇవ్వ‌డంపై సుప్రీం ను అశ్ర‌యించాయి.. అయితే వారి వాద‌ల‌ను తోసిపుచ్చి ఆ చ‌ట్టాన్ని స‌మ‌ర్ధించింది దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement