టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా (ఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. తన పైలట్లను 65 ఏండ్ల వయస్సు వచ్చే వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు సంస్థ అంతర్గత నివేదికల్లో తేలింది. పైలట్లు 65 ఏండ్ల వరకు ఉద్యోగం చేయడానికి సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) అనుమతి ఇస్తున్నది. కానీ ఎయిర్ ఇండియా పైలట్లు 58 ఏండ్లకే రిటైరవుతున్నారు. అత్యధిక విమానయాన సంస్థలు తమ పైలట్లను 65 ఏండ్ల వరకు సర్వీసులో కొనసాగిస్తున్నాయని మహారాజా రూపొందించిన ఆ అంతర్గత నివేదిక వెల్లడించింది. గత నెల 29న ఎయిర్ ఇండియా ఈ నివేదిక రూపొందించినట్లు సమాచారం. సంస్థను విస్తరించాలన్న ప్రణాళికలు రూపొందిస్తున్నది ఎయిర్ ఇండియా. ఈ నేపథ్యంలో కొత్తగా 200కి పైగా విమానాలు కొనుగోలు చేయాలని టాటా సన్స్ భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement