Tuesday, November 26, 2024

National : కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊర‌ట‌…. బెయిల్ మంజూరు…

లిక్కర్‌ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా తాము పంపిన సమన్లకు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు పంపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ ఉదయం ఆయన రౌస్‌ అవెన్యూ కోర్టుకు హాజరవ్వగా.. పూచికత్తుల మీద ఆయనకు బెయిల్‌ మంజూరయ్యింది.

- Advertisement -

వ్యక్తిగతంగా హాజరవ్వాలని కింది కోర్టు పంపిన సమన్లపై కేజ్రీవాల్‌ సెషన్స్‌కోర్టులో సవాల్‌ చేయగా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు వచ్చారు. అయితే.. వెంటనే ఆయనకు బెయిల్‌ మంజూరైంది. బెయిల్‌ కోసం రూ.15 వేల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement