Saturday, November 23, 2024

Relief – భూమా అఖిల ప్రియ‌కు బెయిల్ …

కర్నూల్: మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియకు కర్నూల్ కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది . టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ రాముడిని ఈ నెల 17వ తేదిన‌ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వారికి కోర్టు రిమాండ్ విధించింది. తాజాగా భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారించిన కర్నూల్ కోర్టు భూమా అఖిలప్రియ కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలతో నంద్యాలకు బయలుదేరారు భూమా అఖిల ప్రియ న్యాయవాదులు. బెయిల్ పత్రాలను జైలులో అందిస్తే జైలు నుండి భూమా అఖిలప్రియ నేడు విడుద‌ల కావ‌చ్చు
ఈ కేసు వివ‌రాల‌లోకి ఈ నెల 16వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాలకు చేరుకున్న సమయంలో భూమా అఖిలప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. తన చున్నీ లాగడంతో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసినట్టుగా భూమా అఖిలప్రియ చెబుతున్నారు. భూమా అఖిలప్రియ వర్గీయుల దాడిపై ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 17న భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చారు. అయితే వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ కోసం కర్నూల్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై విచారణ నిర్వహించి న కోర్టు భూమా అఖిలప్రియకు బెయిల్ ను మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement