రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.17.2 ట్రిలియన్లతో భారతదేశపు అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ తర్వాత స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిలిచాయి. వీటి మార్కెట్ విలువ వరుసగా రూ. 11.6 లక్షల కోట్లు, రూ. 8.3 లక్షల కోట్లకు చేరింది. అదానీ టోటల్ గ్యాస్ (ఏటీజీ), అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు టాప్-10 వ్యాల్యూడ్ కంపెనీల జాబితాలోకి ప్రవేశించాయి. ఈ రెండు కంపెనీలు 9,10 ర్యాంకుల్లో ఉన్నాయి. ఏటీజీ విలువ రూ.3.96 లక్షల కోట్లు కాగా, ఎంటర్ ప్రైజెస్ విలువ రూ.3.81 లక్షల కోట్లుగా రికార్డయింది. ఈ మేరకు 2022 బుర్గుండి ప్రైవేట్-హురున్ ఇండియా 500 నివేదిక గురువారం వెల్లడించింది. టాప్ 10లో చోటు దక్కించుకున్న ఇతర కంపెనీలు ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ.
- సన్ ఫార్మా, విప్రో గతేడాది నుండి టాప్ 10 ర్యాంకింగ్స్ నుండి నిష్క్రమించాయి. జాబితాలో స్థానం పొందిన 500 కంపెనీల విలువ 2.7 లక్షల కోట్ల డాలర్లు. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 29శాతానికి సమానం.
- ఈ 500 కంపెనీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. 820 బిలియన్ డాలర్ల అమ్మకాలను కలిగి ఉన్నాయి. 7.3 మిలియన్ల మంది సిబ్బందిని నియమించుకున్నాయి
- ఈ కంపెనీలు దేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 1.5 శాతం వాటాను కలిగివున్నాయి. జాబితాలోని 67 కంపెనీలు 10 కంటే తక్కువ వయస్సు గలవి.
- ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా, జాబితాలోని కంపెనీలు గతేడాదితో పోలిస్తే రూ. 1.78 ట్రిలియన్లను కోల్పోయాయి.
- విద్యుత్, రిటైల్, హాస్పిటాలిటీ, కన్స్యూమర్ గూడ్స్ బలమైన వృద్ధి సాధించిన రంగాలు. సాప్ట్nవేర్, సేవల రంగం గత ఏడాదితో పోలిస్తే 6 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది.
- వ్యాక్సిన్‌మ్ఖేకర్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మొత్తం విలువ రూ. 2.19 ట్రిలియన్‌తో అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ కంపెనీగా అవతరించింది.
- దీని తర్వాత ఆన్‌లైన్ ఎడ్యుకేటర్ బైజూస్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా రూ. 1.82 ట్రిలియన్, రూ. 1.39 ట్రిలియన్‌ల వద్ద ఉన్నాయి.
- 500 కంపెనీలలో ఆర్థిక సేవల కంపెనీలు 73 కాగా, హెల్త్‌కేర్ 60, కెమికల్స్ 37, కన్స్యూమర్ గూడ్స్ 37 కంపెనీలు ఉన్నాయి.
- ఈ జాబితాలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు లేకపోవడం గమనార్హం.