Friday, November 22, 2024

తెలుగు రాష్ట్రాల యూజర్లకు జియో గుడ్ న్యూస్

ఏపీ, తెలంగాణలోని వినియోగదారులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల యూజర్లను ఆకట్టుకునే క్రమంలో నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యాన్ని రిలయన్స్ జియో మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా 20 ఎమ్‌హెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌తో తన నెట్‌వర్క్‌ను బ‌లోపేతం చేయ‌నుంది. దీంతో యూజ‌ర్లకు డేటా వేగం మరింత వేగం కానుంది. దీంతో తెలంగాణ, ఏపీ ప్రజలకు మ‌రింత మెరుగైన 4జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 40 ఎమ్‌హెచ్‌జెడ్ స్పెక్ట్రం ల‌భ్యత ఇప్పుడు 50 శాతం పెర‌గ‌నుంది. దీంతో నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యం 60 ఎమ్‌హెచ్‌జెడ్‌కు చేరుకోనుంది. దీంతో మెరుగైన 4జీ సేవ‌లు అందుబాటులోకి వస్తాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియోకు 3.16 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. దీంతో ఇది 40 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకున్నట్లయింది. ప్రస్తుతం క‌రోనా వైరస్, లాక్ డౌన్ వల్ల డేటా వినియోగం విప‌రీతంగా పెర‌గ‌డం, ఆన్‌లైన్‌ సేవలు పెరగడంతో ఇంటర్నెట్‌కు డిమాండ్ పెరిగింది. ఈ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగానే భవిషత్ అవసరాల నేపథ్యంలో యూజ‌ర్లను మరింతగా రాబట్టుకునేందుకు జియో తన నెట్‌వ‌ర్క్ పరిధిని పెంచుకున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement