రిలయన్స్ రిటైల్ బొమ్మల తయారీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం హర్యానాకు చెందిన సర్కిల్ ఇ రిటైల్ అనే బొమ్మల తయారీ సంస్థతో జాయింట్ వెంచర్‌ను ప్రారంభిం చనుంది. రిలయన్స్ ఇప్పటికే బ్రిటన్‌కు చెందిన బొమ్మల బ్రాండ్ హామ్లేస్‌తో పాటు, దేశీయ బొమ్మల బ్రాండ్ రోవన్‌ను కొనుగోలు చేసింది. కంపెనీ ప్రస్తుతం డిజైన్ నుంచి వివిధ ప్రక్రియలను సమ్మిళితం చేసే వ్యూహంపై పని చేస్తోందని రిలయన్స్ రిటైల్ సీఎఫ్‌ఓ దినేశ్ తలూజా తెలిపారు.
డిజైనింగ్, తయారీ, విక్రయాలు అన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురానుంది. థర్డ్ పార్టీ తయారీదారులపై అధారపడటాన్ని దశల వారీగా తగ్గించాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందు కోసమే ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. బీ2బీ బొమ్మల విభాగంలో రిలయన్స్ రిటైల్ ప్రధాన సంస్థగా కొనసాగనుంది. సర్కిల్ ఇ రిటైల్తో బొమవ్లు తయారీలోనూ ప్రత్యేకత సంతరించుకోనుంది. ఈ సంస్థకు హర్యానాలో ఆధునిక తయారీ యూనిట్ ఉంది. వివిధ రకాల బొమ్మలను తయారు చేసి పంపిణీ చేసేందుకు లైసెన్స్ ఉంది.