Thursday, November 21, 2024

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు 48 గంటల్లో రూ.1000 కోట్లు చెల్లిస్తాం.. ఢిల్లీ హైకోర్ట్ కు తెలిపిన డీఎంఆర్‌సీ

న్యూఢిల్లీ : రూ.4,600 కోట్ల మధ్యవర్తిత్వ అవార్డ్‌కు సంబంధించి 48 గంటల్లో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ విభాగం డీఏఎంఈపీఎల్ (ఢిల్లి ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌) అకౌంట్లో రూ.1000 కోట్లు జమ చేస్తామని ఢిల్లీ హైకోర్ట్‌కు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) వెల్లడించింది. డీఏఎంఈపీఎల్‌ అప్పులను అవార్డు మనీగా మార్చుతామని కంపెనీ వెల్లడించింది. డీఎంఆర్‌సీ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. డీఎంఆర్‌సీ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున.. అప్పులు ప్రయోజనాలను దెబ్బతీస్తాయి.

కాబట్టి అధికారులు పరిష్కారం కోసం అన్వేషిస్తున్నారని కోర్టుకు తుషార్‌ మెహతా వెల్లడించారు. అధికారుల లెక్కల ప్రకారం చెల్లించాల్సిన మొత్త దాదాపు రూ.5 వేల కోట్ల వరకు ఉంటుంది. డీఏఎంఈపీఎల్‌ చెబుతున్నదానికంటే ఇది తక్కువేనని తుషార్‌ మెహతా పేర్కొన్నారు. అప్పు చెల్లింపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. వీలైతే అప్పు చేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారని కోర్టుకు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement