Friday, November 22, 2024

సాగర్ జలాలను విడుదల – సీఎం కేసీఆర్ రైతు ప‌క్ష‌పాతి- మంత్రి పువ్వాడ‌

ఖరీఫ్ పంటల సాగుకోసం పాలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూజలు చేశారు. అనంతరం నీటిని విడుదల చేశారు .ఈ ఏడాది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని మంత్రి అజయ్ అన్నారు. పాలేరు జలాశయంకు ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో నిండుగా ఉందని పేర్కొన్నారు రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని మంత్రి అన్నారు.

రికార్డు స్థాయిలో వరి సాగును చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కొర్రీలు పెట్టడం తగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని రైతన్నలు దృష్టిలో పెట్టుకొని వరికి బదులుగా లాభసాటి, అధిక దిగుబడులు వచ్చే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని కోరారు. బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్‌ఎస్‌ విధానమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. వ్యవసాయంలో తెలంగాణ సగటున 10% వృద్ధిరేటు సాధించిందని, జాతీయ వృద్ధిరేటు 3%కే పరిమితం అయ్యిందన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడమే కేంద్ర ప్రభుత్వం విధానమని మండిపడ్డారు. మీటర్లు పెట్టకపోతే రూ.25 వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు రావని చెప్పినా సరే.. ‘నా కంఠంలో ప్రాణముండగా మీటర్లకు ఒప్పుకోబోం’ అని కేసీఆర్‌ తెగేసి చెప్పారన్నారు. కృష్ణానది జలాల వాటా తేల్చాలని నలుగురు కేంద్ర జలవనరుల శాఖ మంత్రులను కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనాలంటే కొనకుండా కేంద్రం తొండి చేస్తుందని మండిపడ్డారు. వడ్లు కొనబోమని పీయూష్‌గోయల్‌ మొండికేస్తే, వాటిని సీఎం కేసీఆర్‌ కొన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement