Tuesday, September 17, 2024

Released – జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల

ఢిల్లీ – సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవిత తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ట్రయల్ కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్స్ అనంతరం కవిత జైలు నుంచి బయటకు వచ్చారు..కవిత భర్త అనిల్‌ కుమార్, ఎంపీ వద్దిరాజు పది లక్షల రూపాయల ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. అయితే.. రిలీజ్ ఆర్డర్స్‌ అందినప్పటికీ.. తీహార్ జైలు నుంచి కవితను విడుదల చేయడానికి కొన్ని గంటల ప్రాసెస్ కొనసాగింది.

సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేటీఆర్, హారీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు తిహార్ జైలు వద్దకు చేరుకున్నారు. కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి ఆమెకు స్వాగతం పలికారు.. బయటకు వచ్చిన తర్వాత కొడుకు హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను కేసీఆర్ బిడ్డనని.. తప్పు చేయనన్నారు. అనవసరంగా తనను జగమొండిగా మార్చారన్నారు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. నన్ను ఇబ్బంది పెట్టినందుకు మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు

కాగా.. ఈ రాత్రికి కవిత, కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement