Friday, November 22, 2024

Release – నవరత్నాలు నవమోసాలు పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన టిడిపి నేత‌లు

మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో . ‘నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే 150 పేజీల పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ ముఖ్యనేతలు ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, టీ.డీ.జనార్థన్, పరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధారునాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎపి పార్టీ అధ్య‌క్షుడు అచ్చెనాయుడు మాట్లాడుతూ, పచ్చి అబద్ధాలకోరు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు 730 అని, అందులో అమలు చేసింది కేవలం 109 అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. అంటే 15 శాతం మాత్రమే అమలు చేశారని… కానీ, 99.5 శాతం హామీలు అమలు చేశానని చెప్పుకోవడం పచ్చి అబద్ధాలు, నిలువెత్తు మోసాలకు ప్రతిరూపమైన జగన్ రెడ్డికే చెల్లిందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

బొండా ఉమ మాట్లాడుతూ అధికారం కోసం అవాస్తవాలు చెప్పడం, సీఎం అయ్యాక కక్ష సాధింపులు, దోపిడీలకు పాల్పడడమే జగన్ రెడ్డి నైజం అని మండిపడ్డారు. “అధికారంకోసం జగన్ రెడ్డి ప్రజలకు చెప్పిన అవాస్తవాలకు ప్రతిరూపమే టీడీపీ విడుదలచేసిన పుస్తకం. అలానే సాక్షి టీవీలో ప్రసారమైన జగన్ రెడ్డి హామీల తాలూకా వీడియో క్లిప్లింగ్స్ ను కూడా ప్రజలముందుకు తీసుకొచ్చాం. మరో 3 నెలల్లో జగన్ రెడ్డి ఇంటికెళ్లడం ఖాయం. ఈ నేపథ్యంలో మోసకారి జగన్ రెడ్డి మాటలు, హామీలు ప్రజలకు గుర్తుచేయడానికే టీడీపీ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది అని అన్నారు.

కేవలం ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న ఉబలాటం తప్ప, జగన్ రెడ్డికి ప్రజల యోగక్షేమాలు, సాదకబాధకాలు పట్టవని అర్థమైంద‌న్నారు వ‌ర్ల రామ‌య్య . జగన్ రెడ్డి అమ్ముతున్న కల్తీ మద్యంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పేదలు ఆసుపత్రుల పాలయ్యార‌న్నారు. ఇంత చేసిన ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని మహిళల ఓట్లు అడుగుతారు? జగన్ రెడ్డి మేనిఫెస్టో అంతా పచ్చి బూటకం… అబద్ధాల పుట్ట, ఇక ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరు” అని రామయ్య తేల్చిచెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement