రామగుండం ఎరువుల కర్మాగారం కు వెళ్తున్న తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం సాయంత్రం విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరువుల కారణాగరంలో ఉద్యోగాలు పెట్టిస్తామని ఎమ్మెల్యే తో పాటు ఆయన అనుచరులు 33 కోట్ల రూపాయలు దండుకున్నారని, ఎమ్మెల్యే అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఎమ్మెల్యే అవినీతిని నిరూపించకపోతే క్యూ న్యూస్ ఛానల్ బంద్ చేస్తానని, నిరూపిస్తే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.