ఉక్రెయిన్‌లోని మెలిటొపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా దళాలు నేడు విడుదల చేశాయి. మేయర్ విడుదలకు బదులుగా కీవ్‌లో బందీలుగా ఉన్న 9 మంది సైనికులను ఉక్రెయిన్ విడిచిపెట్టింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తమకు సహకరించడంలేదన్న కారణంగా రష్యా దళాలు ఇవాన్‌ను కిడ్నాప్‌చేశాయి. తొలుత ఆయన్ను లుహాన్స్క్ ప్రాంతానికి తరలించారు.
మూడు రోజుల తర్వాత మరొక ప్రదేశానికి తీసుకెళ్లారు. ఉక్రెయిన్ విడుదల చేసిన రష్యా సైనికులంతా 20 ఏళ్ల లోపువారే. తమ నిర్బంధంలోని సైనికులు 2002-03 మధ్య జన్మించిన వారేనని ఉక్రెయిన్ పేర్కొంది. కాగా, ద్నిప్రోరుడ్నే మేయర్‌ను కూడా రష్యా దళాలు కిడ్నాప్ చేశాయి. అతని విడుదల కోసమూ జెలెన్‌స్కీ ప్రయత్నాలు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..