Friday, November 22, 2024

కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల

కేంద్ర ప్రభుత్వ రైతు ప్రాయోజిత పథకం కిసాన్‌ సమ్మాన్‌ కింద 13వ విడత నిధులను ప్రధాని మోడీ సోమవారం విడుదల చేశారు. ఎనిమిది కోట్లకు పైగా రైతులకు లబ్ది చేకూరేలా రూ.16,800 కోట్ల రూపాయలను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో ఏటా రూ.6000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. 2019 లో కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ పథకాన్ని ప్రారంభించింది.

పరిమిత వ్యవసాయ వనరులున్న చిన్నకారు రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.2.25 లక్షల కోట్లకు పైగా నిధులు పంపిణీ అయినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో రూ.1.75 లక్షల కోట్లు పంపిణీచేయబడ్డాయి. రైతు కుటంబాల్లో మూడు కోట్ల మంది మహిళా లబ్దిదారులకు కూడా ఈ పథకం మేలు చేకూర్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement