దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 15 వరకు పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జూన్ 27 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జూలై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుండగా.. జూలై 9న ప్రొవిజనల్ ఆన్సర్ కీలను విడుదల చేయనున్నారు. అలాగే.. జులై 18న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత జులై 21న ఆర్కిటెక్చర్ ఆప్డిట్యూట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్, మే నెలల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహించే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..