అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రిక్రూట్‌మెంట్ నిర్వహించడానికి ఇండి యన్ ఎయిర్‌ఫోర్స్ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త పథకం అగ్నిపథ్ ద్వారా ఎయిర్‌ఫోర్స్ లో చేరడానికి ప్రతి భారతీయుడికీ అర్హత ఉంది. వయసు 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెడిికల్ నిబంధలనల ప్రకారం ఫిట్‌నెస్‌లో అర్హులై ఉండాలి. శిక్షణా సమయంలో యూనీఫాం తప్పనిసరని ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది. నాలుగేళ్ల సర్వీస్‌కు ఎంపికయ్యే అగ్నివీర్‌లకు మొదటి ఏడాది నెల వేతనం రూ. 30 వేలు. రెండో ఏడాది రూ. రూ. 33 వేలు, మూడో సంవత్సరం రూ.36,500, నాలుగో ఏడాది రూ. 40 వేలు లభి స్తుంది. సంవత్సరానికి 30 రోజుల సెలవుతో పాటు డాక్టర్ల సూచనపై మెడికల్ లీవ్ ఉంటుంది.
సర్వీస్ పూర్తి కాకుండానే, పదవీ విరమణ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి రూ. 10.04 లక్షలతో పాటు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ప్రకటనలో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.