న్యూఢిల్లి : ప్రపంచ వ్యాప్తంగా ఆహర ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతీ దేశం ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధించుకున్నాయి. ఫలితంగా భారత్ కూడా గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ధరలు భారీగా పెరిగాయి. జీ7 దేశాల విన్నపంతో పాటు ఇతర దేశాల అధ్యక్షుల రిక్వెస్ట్ మేరకు భారత్ ప్రభుతం కొంత వెసులుబాటు ఇచ్చింది. మే 13 లేదా అంతకంటే ముందు కస్టమ్స్‌లో ఉన్న గోధుమల ఎగుమతికి అనుమతి ఇస్తూ ఉత్తరులు జారీ చేసింది. దీంతో ఎగుమతిపై విధించిన నిషేధం కొంత సడలించినట్టయ్యింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ ఓ ప్రకటన విడుదల చేసింది. 13వ తేదీ కంటే ముందు బిల్లింగ్ అయిన గోధుమల ఎగుమతులు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈజిప్ట్‌కు వెళ్లే గోధుమను కూడా ఎగుమతికి అనుమతిస్తున్నట్టు వివరించింది. కాండ్లా నౌకాశ్రయంలో లోండింగ్‌లో ఉంది. ఎగుమతిపై నిషేధం విధించడంతో గోధుమలు పోర్టులోనే ఉండిపోయాయి.
తమ సరుకును వెంటనే నౌకాశ్రయం నుంచి తరలించేందుకు అనుమతించాలంటూ ఈజిప్టు ప్రభుతం భారత్‌ను కోరింది. దీంతో కాండ్లా పోర్టు నుంచి గోధుమల లోడుతో ఉన్న నౌక బయలుదేరింది. పెరుగుతున్న గోధమల ధరలను నియంత్రించడానికి, భారతదేశంలో ఆహార భద్రతను నిర్వహించడానికి గోధుమ ఎగుమతులను పరిమితం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మే 13న ఉత్తరులు జారీ చేసింది. లెటర్ ఆఫ్ క్రెడిట్ చేయడం ద్వారా ఇప్పటికే ముందస్తు కమిట్‌మెంట్లు చేసిన సందర్భంలో నిషేధం వర్తించదని ప్రభుతం ఉత్తరుల్లో పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా గోధుమ ధరలు భారీగా పెరుగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..