Friday, November 22, 2024

ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధనను ప్రవేశ పెట్టిందేకు విధివిధానాలను ఖరారు చేస్తూ నివేదిక సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశంపై ఈ నెల 2న క్యాబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చర్చించిన మేరకు ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై, ఇంగ్లీష్‌ మీడి యం బోధనపై కూలం కషంగా చర్చించారు.

అదేవిధంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష, మన ఊరు- మన బడి పథకం అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్‌ మీడియం బోధనపై చర్చించారు. ప్రయివేటు, అన్‌ఎయి డడ్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో విధివిధానాలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement