హైదరాబాద్: తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒప్పంద టీచర్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 16 ఏళ్లుగా 567 మంది ఉపాధ్యాయులు ఒప్పంద పద్ధతిలో కొనసాగుతున్నారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.
Regularization – గురుకులాల ఒప్పంద టీచర్ల క్రమబద్ధీకరణకు కెసిఆర్ ఆదేశం ..
Advertisement
తాజా వార్తలు
Advertisement