ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ తీసుకొచ్చామని…. జీవో నెం.41 ద్వారా రెండేళ్ల పాటు ఈవీ పాలసీ అమల్లో ఉంటుందన్నారు. అలాగే జంట నగరాల్లో ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
కాగా, ఈ పాలసీ రేపటి (నవంబర్ 18) నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అమలులో ఉంటుందన్నారు. ఈ పాలసీ ప్రకారం ఎలట్రిక్ వాహనాల్లో టూ వీలర్స్, 4 వీలర్స్ & కమర్షియల్ వాహనాలకు 100% పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. వీటితో పాటు ఈవీల రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తున్నట్లు ప్రకటించారు.