కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీలో ఈ నెల 22నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్‌వో సహకారంతో వర్సిటీలో రెండోసారి ఈ డ్రైవ్‌ను చేపడుతున్నామని వెల్లడించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా ఈ నెల 27 వరకు ఓయూ హెల్త్ సెంటర్‌లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement