హైదరాబాద్,ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లాలో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న ముగ్గురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.మారణాయుదాలతో రీల్స్ చేస్తున్న ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. రివాల్వార్ లోడ్ చేసి కాల్పులు జరుపుతున్నట్లు, గన్ తలకు గురిపెట్టుకుంటూ సదరు యువకులు వీడియోలు తీశారు.
అనంతరం వాటిని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తల్వార్, కత్తులతో ఫొటోలకు ఫోజులిచ్చుకుంటూ వారి అకౌంట్లలో పోస్టులు పెట్టారు. ఆ వీడియోలు, ఫోటోలు నిర్మల్ జిల్లా పోలీసు అధికారుల కంట పడ్డాయి. ఫేమస్ అవ్వడానికి మారణాయుధాలతో రీల్స్ చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకున్నారు.