Tuesday, November 19, 2024

రైల్వేప్రయాణికులకు శుభవార్త.. ప్లాట్‌ఫారాల టిక్కెట్ ధరలు తగ్గింపు

కరోనా విజృంభణ సమయంలో పెంచిన ప్లాట్‌ఫారాల టిక్కెట్ ధరలను రైల్వేశాఖ తగ్గించింది. ఈ మేరకు సికింద్రాబాద్‌ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారం టికెట్‌ ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.50 ఉన్న ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరను రూ.10కి తగ్గించింది. మరోవైపు చిన్న స్టేషన్‌లలో ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరను రూ.10గా నిర్ణయించింది.

కరోనా కాలంలో వైరస్‌ను నియంత్రించేందుకు, ప్రజల రద్దీని తగ్గించేందుకు ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరలను రైల్వేశాఖ రూ.50కి పెంచింది. తాజాగా అధికారులు అన్‌రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌, సాధరణ రైళ్లను పునరుద్ధరించడంతో పెంచిన టిక్కెట్ ధరలను తగ్గించింది. ప్రయాణికుల సౌకర్యం, సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గం: కేంద్రం

Advertisement

తాజా వార్తలు

Advertisement