Monday, November 18, 2024

అనర్హత కాలం తగ్గింపు, ఈసీ అధికారాలపై పిటిషన్‌.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 11 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చట్టంలోని నిబంధన ప్రకారం ప్రజాప్రతినిధి అనర్హత కాలాన్ని తొలగించే లేదా తగ్గించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది. దీన్ని తప్పుపడుతూ ఎన్‌జీవో తరఫున రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఎన్‌. శుక్లా సుప్రీంకోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు.

చీఫ్‌ జస్టిస్‌ యుయు లలిత్‌, జస్టిస్‌ త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈసీకున్న ఆ ప్రత్యేక నిబంధన తొలగించాలని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై తమ అభిప్రాయం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement