Tuesday, November 26, 2024

విమాన ఇంథనం తగ్గింపు.. జెట్‌ ఇంధనం ధర 12 శాతం తగ్గింపు

విమాన ఇంథనం (ఏటీఎఫ్‌) ధరను ప్రభుత్వం 11.75 శాతం తగ్గించింది. ప్రస్తుతం కిలో లీటర్‌ ధర 16,232.36 రూపాయలు ఉంది. దీనిపై 11.75 శాతం తగ్గించడంతో ఢిల్లిdలో ఈ ధర 12,915.57 రూపాయలు అయ్యింది. రాష్ట్రాల్లో పన్నులను ఈ రేటులో కొంత మార్పు ఉంటుంది. ఈ సంవత్సరం జులై 16న కిలో లీటర్‌ ఇంథనం రేటును 2.2 శాతం అంటే 3,084.94 రూపాయలు తగ్గించారు. విమాన ఇంథన ధరలను ప్రతి నెల 1వ తేదీ, 16వ తేదీన సమీక్షిస్తారు.

గృహ వినియోగ ఎల్పీజీ రేట్లను నెలకు ఒకసారి సమీక్షిస్తారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల బ్యారెల్‌కు 103.60 డాలర్లు ఉంది. వారం రోజుల క్రితం ఈ రేటు 110 డాలర్లుగా ఉంది. 2022 సంవత్సరం ప్రారంభం నుంచి చూస్తే విమాన ఇంథనం రేట్లను ప్రభుత్వం 11 సార్లు పెంచింది. దీంతో అంతకు ముందున్న రేట్ల కంటే రెట్టింపు అయ్యాయి. విమానాల ఆపరేటింగ్‌ ఖర్చులో ఇంథనం వాటానే 40 శాతం వరకు ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ రేట్లలో మాత్రం మార్పు లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement