నిన్న స్వల్పంగా పైకి చేరిన పసిడి రేటు ఈరోజు మాత్రం నిలకడగానే కొనసాగింది. దీంతో జూన్ 14న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 48,360 వద్దనే ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాములకు రూ. 52,760 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగితే.. వెండి రేటు (Silver Price) మాత్రం పడిపోయింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 200 తగ్గింది. దీంతో దీని రేటు రూ.67,300 వద్ద ఉంది. బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్‌లోని గోల్డ్ రేట్లు కూడా ప్రభావం చూపుతాయి. అందువల్ల ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర నేలచూపులు చూస్తోంది. పసిడి రేటు ఔన్స్‌కు 0.35 శాతం మేర క్షీణించింది. 1825 డాలర్లకు దిగి వచ్చింది. అదేసమయంలో సిల్వర్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ ధర ఔన్స్‌కు 0.57 శాతం పడిపోయింది. 21.13 డాలర్ల వద్ద కదలాడుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో రేట్లు స్థిరంగా కొనసాగడం గమనార్హం.