ముంబై:మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై లీటర్‌కు ఏకంగా రూ.5, డీజిల్‌పై రూ.3లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఏటా ప్రభుత్వం రూ.6వేల కోట్ల భారం పడనుంది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పెట్రో ఉత్పత్తులపై వాల్యుయాడెడ్ టాక్స్ (వాట్)లో కోత విధించడం ద్వారా ఈ తగ్గింపు వర్తింప చేయనున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. గత మేలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సయిజ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పన్నులు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని సూచించిందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గుర్తు చేశారు. కానీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం చేష్టలుడిగిందని, కానీ తమ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. తగ్గింపు ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ధరలు తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.106లు, డీజిల్ రూ.94లకు అటూఇటూగా ఉంటుందని చెప్పారు. ఉద్ధవ్ సారథ్యంలోని శివసేనపై తిరుగుబాటి చేసిన ఏక్‌నాథ్ షిండే మెజారిటీ వర్గంగా విడిపోయి బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నిర్ణయంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం పట్ల శివసేన-బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
దలేర్ మెహందీకి జైలు శిక్ష
మానవ అక్రమ రవాణా కేసులో దోషిగా నిర్ధారణ కోర్టు ఆదేశంతో అరెస్టు.. జైలుకు తరలింపు పటియాలా:ప్రఖ్యాత పంజాబీ గాయకుడు దలేర్ మెంహందీకి జైలుశిక్ష విధిస్తూ పటియాలా కోర్టు తీర్పునిచ్చింది. దలేర్ మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ 2003లో దాఖలైన కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. దలేర్ వేసిన పిటిషన్ కొట్టివేయడతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. పదిహేనేళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో పటియాలాలోని జిల్లా కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి హెచ్.హెచ్.అగర్వాల్ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు. తక్షణం దహేర్‌ను అరెస్టు చేయాలని ఆదేశించారు. చట్టవిరుద్ధంగా మానవ అక్రమ రవాణాకు పాల్పడిన ముఠాతో దలేర్ మెహందీకి సంబంధం ఉందని, ఈ వ్యవహారంలో అతడు దోషిగా కోర్టు నిర్ధారించింది. మానవ అక్రమ రవాణా ముఠాకు సంబంధించి దలేర్ మెహందీ, అతడి సోదరుడు షంషీర్‌సింగ్‌లపై 31 కేసులు నమోదైన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.