Saturday, November 23, 2024

తగ్గిన ఇన్ ఫ్లో.. ఎస్సారెస్పీ వరద గేట్ల మూసివేత

మెండోర, (ప్రభ న్యూస్): ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. పది రోజులుగా భారీగా కొనసాగిన ఇన్ ఫ్లో ప్రస్తుతం (శ‌నివారం) తగ్గు ముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు అధికారులు వరద గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు లోకి 26, 510 క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్ర‌మే వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. వరద కాల్వ ద్వారా 10వేల క్యూసెక్కులు, కాకతీయ కాల్వ ద్వారా 3,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు వ‌దులుతున‌నారు.

ఇక‌.. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు కాగా, శనివారం నాటికి 1088.1అడుగులు 76.743 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టులో 1085.4 అడుగులు 68.113 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సీజన్ లో జూన్ 1వ తేదీ నుండి ఇప్పటి వరకు 139.795 టీఎంసీల నీరు రాగా, 83.757టీఎంసీల నీటిని ప్రాజెక్టు నుండి విడుదల చేసినట్లు అధికారులు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement