బంగారం ధరలు పడిపోయాయి. దేశంలో పసిడి రేటు ఈ నెలలోనే కనిష్ట స్థాయికి క్షీణించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు వడ్డీ రేటు పెంపు కొనసాగుతుందని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ గత వారంలో కీలక వ్యాఖ్యలు చేయడంతో పసిడిపై ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో (ఎంసీఎక్స్) సోమవారం గోల్డ్ ఫ్యూచర్స్ ధర నెల కనిష్టానికి దిగి వచ్చింది. 0.5 శాతం మేర క్షీణించింది. పది గ్రాములకు రూ. 50,970కు పడిపోయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ధర కూడా పతనమైంది. 1.3 శాతం కుప్పకూలింది. కేజీకి రూ.54,063కు దిగి వచ్చింది. కాగా శుక్రవారం కూడా బంగారం ధర రూ. 500 మేర క్షీణించిన విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లో రేట్లు తగ్గుదల ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
Advertisement
తాజా వార్తలు
Advertisement