దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.బంగారానికి ఉన్న డిమాండ్ మరింకా దేనికి లేదు. గత కొన్నిరోజుల స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,700 కి చేరింది.
అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 240 తగ్గి రూ. 49,860కి చేరింది. అటు వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ. 76,100 కు చేరింది.