Wednesday, November 20, 2024

తెలంగాణాలో తగ్గిన రైతుల ఆత్మహత్యలు.. లోక్‌సభలో వెల్లడించిన‌ కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.2014తో పోలిస్తే 2020 నాటికి సగానికి సగం రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. 2014 నుంచి ఒక సంవత్సరం మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. 2014లో 898 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడగా, 2015లో 1358 మంది, 2016లో 632 మంది, 2017 846 మంది, 2018లో 900 మంది, 2019లో 491 మంది, 2020లో 466 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement