దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..గడిచిన 24 గంటల్లో 7,61,737 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,116 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల సంఖ్య 47కి పరిమితమైంది. ఇప్పటి వరకు కొవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 5,15,850కి చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్న కారణంగా, యాక్టివ్ కేసులు గణనీయం తగ్గాయి. తాజాగా 5,559 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.24 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.71 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 38,069 ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇది కేవలం 0.9శాతం మాత్రమే. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే వుంది. తాజాగా 20,31,275 మంది టీకాలు తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 180 కోట్లు దాటింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement