వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొంత కాలంగా ప్రతి నెల సిలిండర్ ధరలు పెంచుతున్న కేంద్రం ఎట్టకేలకు ప్రజలకు ఊరట కలిగించింది. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించింది. అయి , ఇది సాధారణ సిలిండర్లకు కాదు.
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.198 తగ్గించింది. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.2219 నుంచి రూ.2021కి పడిపోయింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో రూ.2426గా ఉన్న సిలిండర్ ధర రూ.2243కు చేరింది. హైదరాబాద్ లో ఒక సిలిండర్ పై ధర రూ.183.50 తగ్గింది.