దేశ రాజధాని హస్తినలో ఎర్రకోట తనదే అంటూ ఓ మహిళా ఢిల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుల్తానా బేగం అనే మహిళ ఎర్రకోట తనదేనంటూ.. 170 ఏళ్ల తరువాత మొఘల్ వారసులం అంటూ ఢిల్లి హైకోర్టును ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్ హౌరాలోని మురికివాడలో నివసించే 68 ఏళ్ల సుల్తానా.. తాను మొఘలు చివరి చక్రవర్తి బహదూర్ షా ముని మనవడు మీర్జా మహమ్మద్ బీదర్ భక్త్ భార్య అని తెలిపింది. రంగూన్ నుంచి తప్పించుకుని తాము భారత్‌లో వచ్చి ఉంటున్నామని చెప్పింది. ఈ పిటిషన్‌లో తాను మొఘలుల వారుసురాలిని కనుక ఎర్రకోటను తనకు అప్పగించాలని, లేకపోతే.. అందుకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించాలని సుల్తానా పిటిషన్‌లో పేర్కొంది.
బహదూర్ షాను 1857లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలు పదవి నుంచి తొలగించాయని, అప్పుడు ఆయనకు చెందిన ఆస్తులను అక్రమంగా కంపెనీ లాగేసుకుందని చెబుతున్నది. బహదూర్ షా జాఫర్ 2వ వారసుడిగా బీదర్ భక్త్‌ను 1960లో ప్రకటించిందని సుల్తానా వివరించింది. ఆ బీదర్ భక్త్ తన భర్త.. ఆయన 1980లో మే 22న చనిపోయారని తెలిపింది. అప్పటి నుంచి భారత్ ప్రభుత్వం అంటే 1980, ఆగస్టు 15 నుంచి పెన్షన్ ఇస్తోందని కోర్టుకు వివరించింది. ఈ పెన్షన్ తనకు సరిపోవడం లేదని పిటిషన్‌లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఎర్రకోటను తమ ఆధీనంలో ఉంచుకుందని వివరించింది. 1857 నుంచి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ రేఖా ధర్మాసనం అనేక ప్రశ్నలు సంధించింది. 1857లో అన్యాయం జరిగితే.. 170 ఏళ్ల తరువాత ఎందుకు కోర్టును ఆశ్రయించారని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఏం చేశారన్నారు. తన క్లయింట్ నిరక్ష్యరాసులని, అందుకే కోర్టుని ఆశ్రయించలేదని సుల్తానా తరఫు న్యాయవాది వివరించారు. ఇది అసలు ఆమోదయోగ్యం కాదంటూ.. ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital