ముంబై: రెడ్ బస్ అంటే ప్రయివేటు బస్సుల్లో కానీ, ఆర్టీసీ బస్సుల్లో కానీ టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే యాప్. అనతికాలంలోనే ప్రయాణికుల నుంచి విశేషణ ఆదరణ పొంది దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫాంగా ఖ్యాతి గడించింది. తాజాగా రైల్వే ప్రయాణికులకూ రెడ్ బస్ సేవలు అందించనుంది. ఈ మేరకు ఐఆర్సీటీసీతో రెడ్ బస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్లైన్ ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ సేవలు అందించేందుకు రెండు సంస్థల మధ్య అంగీకారం కుదిరింది. రైలు ప్రయాణికుల కోసం రెడ్ రైల్ పేరుతో టికెట్లు అందించనున్నారు. ఇప్పుడు రెడ్ బస్ యాప్ వినియోగదారులు అదే యాప్‌లో బస్సు, రైలు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. త్వరలో డెస్క్ టాప్, మాబ్వెబ్, ఐవోఎస్‌లలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని రెడ్ బస్ యాజమాన్యం వెల్లడించింది. రైలు టికెట్లు బుక్ చేసుకునే సమయం నుంచి బోర్డింగ్ వరకు రెడ్ రైల్ అత్యుత్తమ బుకింగ్ సేవలు అందించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. టికెట్ల క్యాన్సిలేషన్లపై తక్షణమే రీఫండ్ సహా అన్ని సేవలు అందించనుంది. ప్రస్తుతం 5 ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement