Tuesday, November 26, 2024

దసరా సందర్భంగా 40 శాతం పెరిగిన రెడ్‌ బస్‌ బుకింగ్స్‌

హైదరాబాద్‌ : దసరా పండగ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణలో బస్‌ బుగింగ్స్‌ 40 శాతం పెరిగాయని రెడ్‌ బస్‌ తెలిపింద. పండగ సెలవులకు వెళ్లే వారి కోసం దసర బుకింగ్స్‌ను 14 రోజుల ముందుగానే ప్రారం భించినట్లు తెలిపింది. సెలవుల మూలంగా చాలా మంది సొంత గ్రామాలకు, మరికొంత మంది హాలిడే గడిపేందుకు వెళ్తున్నారని తెలిపింది. హైదరాబాద్‌ నుంచి ఎక్కువ మంది తిరుపతి, శ్రీశైలం, అన్నవరం దేవస్థానాలకు వెళ్తున్నారు. పండగల సమయంలో రోజుకు 3.2 లక్షల మంది ప్రయాణిస్తుంటారని అంచనా.

హైదరాబాద్‌ ముఖ్యమైన అవుట్‌బౌండ్‌ ట్రావెల్‌ హబ్‌గా పని చేస్తుందని పేర్కొంది. దీని తరువాత విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, కాకినాడ, కర్నూులు నుంచి అత్యధిక మంది అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలు చేస్తున్నారని తెలిపింది. ఈ సీజన్‌లో ప్రయాణికుల ట్రాఫిక్‌ 40 శాతం పెరిగిందని రెడ్‌బస్‌ సీఈఓ ప్రకాష్‌ సంగం తెలిపారు. దీని వల్ల తమ భాగస్వాములైన బస్సు ఆపరేటర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

ప్రధానంగా దసరా సందర్భంగా అంతరాష్ట్ర ప్రయాణాల్లో హైదరాబాద్‌ నుంచి బెంగళూర్‌, చెన్నయ్‌, ముంబైకి ఎక్కువ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. దీంతో పాటు తిరుపతి- బెంగళూర్‌, నెల్లూరు- బెంగళూర్‌కు కూడా ఎక్కువ బుకింగ్స్‌ జరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్‌ – విజయవాడ, విశాఖపట్నం- హైదరాబాద్‌, హైదరాబాద్‌-ఒంగోలు, హైదరాబాద్‌-నెల్లూరు, హైదరాబాద్‌-గుంటూరు రూట్లలో ఎక్కువ టికెట్లు బుక్‌ అయినట్లు రెడ్‌బస్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement