Monday, November 18, 2024

భగ్గుమంటున్న ఉత్తర భారతం, రాజస్థాన్‌లో రెండ్రోజుల పాటు రెడ్ అలర్ట్.. వారం పాటు హీట్‌వేవ్ వార్నింగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పశ్చిమ, ఉత్తర, మధ్య భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రెండ్రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని బార్మర్ (48), శ్రీగంగానగర్ (47.2), చురు (47), అజ్మీర్ (45), ఉదయ్‌పూర్ (44) డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 3 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అప్రమత్తం చేసింది. పశ్చిమ భారతదేశంలో మే 17 వరకు హీట్‌వేవ్ ప్రభావం ఉంటుందని తెలిపింది. పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, జమ్ము-కశ్మీర్‌లో కొన్ని ప్రాంతాల్లో వారం పొడుగునా వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement